రేపటి నుంచి వారం రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన

కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు ఫ్రాన్స్‌, స్లోవేకియాను సందర్శించనున్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేయడం దిశగా పర్యటన ఉండనుంది. ఈ రెండు దేశాలతో భారత్ రక్షణ, పౌర అణు ఇంధనం రంగాలలో ద్వైపాక్షిక సహకారం దిశగా ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో జరిగే జీ-7 సదస్సు (G7 Summit) అవుట్‌రీచ్ సెషన్స్‌ సదస్సుకు ప్రధాని హాజరై ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో గ్లోబల్ దక్షిణ దేశాల ప్రాధాన్యతలను వివరించనున్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య 12 కొత్త ద్వైపాక్షిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ సదస్సులో భాగంగా ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే మోదీ, ట్రంప్‌ (PM Modi – Trump) భేటీపై భారత్, అమెరికా దౌత్యవర్గాలు చర్చలు జరుపుతుతున్నాయి.

Read Also:  ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం స్పెషల్ ఫోకస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>