విద్యార్థుల భవిష్యత్‌‌తో చెలగాటం ఆడొద్దు: భోగ శ్రావణి

కలం, కరీంనగర్ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్‌తో నాయకులు చెలగాటం ఆడడం సరికాదని, తక్షణమే కేంద్రియ విద్యాలయానికి స్థలం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్ (Boga Sravani Praveen) డిమాండ్ చేశారు. జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రావణి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ, కేంద్రియ విద్యాలయాలను మంజూరు చేసిందన్నారు. కోరుట్లలో ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పడి, ఏడాది కాలం పూర్తయ్యిందని గుర్తు చేశారు. కానీ జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో వాలంతరి స్థలం 10 ఎకరాలు కేటాయించడం ఎందుకు ఇబ్బంది అవుతుందో స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మంత్రి తక్షణమే స్పందించాలి..

నిజామాబాద్‌లోని కలికోటలో ఎప్పుడో స్థలం కేటాయింపు జరిగిందని, వనపర్తిలో స్థలం కేటాయింపు జరిగిందని, జగిత్యాలలో ఎందుకు స్థల కేటాయింపునకు నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రులతో కలిసి అభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే, ఫోటోలు, ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రచారం చేసుకోవడం మానుకోవాలని, పనిచేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని శ్రావణి హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్‌తో స్థానిక ఎమ్మెల్యే ఆడుకుంటున్నారని, స్వార్థం, స్వలాభం కోసం ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కేంద్రియ విద్యాలయం స్థలం కేటాయింపు విషయంలో జిల్లా మంత్రి జోక్యం చేసుకోకపోవడం విచారకరం అన్నారు. ఈ విషయంపై మంత్రి తక్షణమే స్పందించాలని కోరారు.

కేటాయింపు జరగకపోతే.. నిరాహార దీక్ష చేపడతాం..

మే 15వ తేదీలోపు స్థలం కేటాయింపు జరగకపోతే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు బీజేపీ ఎంత దూరమైనా వెళ్తుందని హెచ్చరించారు. కేంద్రియ విద్యాలయం రావడం కేవలం విద్యార్థుల భవిష్యత్ కోసం మాత్రమే కాదని, ఈ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 42వ వార్డ్ కౌన్సిలర్ మిమ్మల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, జిల్లా కార్యదర్శి పాత రమేష్, పూదరి శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, గట్టిపల్లి జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, రవితేజ, గంగరాజం తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>