కలం, మహబాబ్‌నగర్ బ్యూరో : దేశ ప్రధాని నరేంద్ర మోడీ 138వ మన్‌కీబాత్ కార్యక్రమం (Mann Ki Baat 138th Episode) సందర్భంగా జాతీయ భద్రత, దేశ ప్రగతికి సంబంధించిన అంశాలనే ప్రస్తావించారని మహబాబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం భూత్పూర్ మండలం గోప్లాపూర్ గ్రామంలోని బీజేపీ కార్యకర్త మల్లేష్ ఇంట్లో ప్రధాని నరేంద్ర మోడీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా డీకే అరుణ (DK Aruna) మాట్లాడుతూ.. సరిగ్గా పదేళ్ల క్రిందట సర్జికల్ స్ట్రైక్‌తో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. దేశ భద్రతకు ముప్పుగా పరిమించే ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు.
అలాగే దేశంలో జన గణన ప్రక్రియ దేశవ్యాప్తంగా మొదటి దశ దాదాపు పూర్తి కావచ్చిందని ,ఇప్పటికీ 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు ప్రధాని (PM Modi)స్పష్టం చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు అశోక్ సింగల్ చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రస్తావించారని ఆమె తెలిపారు.
అనంతరం భూత్పూర్ శివాలయంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ,గిరి వర్ధన్ రెడ్డి ,కట్టా సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎగ్గని నర్సింలు, రవీందర్ రెడ్డి, పట్నం శ్రీశైలం, కౌన్సిలర్ శ్రీనివాసులు, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

