Mobile Popup Ad
Mobile Popup Ad

దేశం పరువు తీస్తున్న రాహుల్ గాంధీ.. డీకే అరుణ ఫైర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రపంచ దేశాల్లో భారత్ పరువును రాహుల్ గాంధీ బజారుకీడుస్తున్నాడని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశానికి అత్యధిక కాలం 4,399 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించి మోదీ రికార్డు సృష్టించారని కొనియాడారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీపై విశ్వాసంతో.. కాషాయ జెండాను ప్రజలు ఎగురవేస్తున్నారని వివరించారు. 12 ఏళ్ల ఎన్డీయే పాలనలో దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందన్నారు. జపాన్‌ను సైతం వెనక్కి నెట్టి నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.

11 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు..

ప్రధాని మోదీ జన్ ధన్ యోజన ప్రారంభించి 58.2 కోట్ల మందికి జీరో బ్యాంక్ ఖాతాలు తెరిపించారని ఎంపీ డీకే అరుణ ప్రశంసలు కురిపించారు. వీటిలో 32 కోట్ల మంది మహిళల ఖాతాలే ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ లేని 11 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించారు. పది కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందిస్తున్నారు. కొవిడ్ నుంచి నేటి వరకు 81 కోట్ల మంది ప్రజలకు ప్రధాన మంత్రి గరీబ్ అన్న యోజన ద్వారా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తున్నారు. రైతాంగానికి ఎరువులను 90శాతం సబ్సిడీకే అందిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఎయిమ్స్‌ల సంఖ్య 4 నుంచి 23 వరకు పెంచింది అని గుర్తు చేశారు.

మోదీపై కావాలనే దుష్ప్రచారం..

దేశంలో మోదీ హయాంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నా.. కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ డీకే.అరుణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున రోడ్లు, జాతీయ రహదాలు, రింగ్ రోడ్డు, బైపాస్ పనులు, గ్రామీణ సడక్ యోజన, CRF ద్వారా రోడ్ల విస్తరణకు కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఆలస్యం చేయకుండా విడుదల చేస్తే అభివృద్ధి పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపా చారి, జాతీయ కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అచ్చుగట్ల అంజయ్య, పడకుల బాలరాజు, కిరణ్ కుమార్ రెడ్డి, జ్యోతి, కృష్ణవర్ధన్ రెడ్డి, పడకుల సత్యం, సుబ్రమణ్యం, యాదయ్య, యాదగిరి, కరుణాకర్, పద్మమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>