కలం, వెబ్‌డెస్క్: బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj). ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ (Divya Sathyaraj)తండ్రి ప్రొఫెషన్‌కు భిన్నంగా పోషకాహార నిపుణురాలిగా స్థిరపడ్డారు. ఇటీవల దివ్య సత్యరాజ్ భారత వివాహ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని కనడానికి పెళ్లి (Marriage) చేసుకోవాల్సిన అవసరం లేదని, పెళ్లి చేసుకోకుండానే తాను తల్లిని అవుతానని వ్యాఖ్యానించారు. తనకు వ్యక్తిగతంగా వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని దివ్య అన్నారు. కేవలం తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుందని తాను భావించడం లేదని చెప్పారు.
ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం, గౌరవం, ప్రేమ ఉండాలని దివ్య అన్నారు. ఇద్దరు కలిసి జీవించడానికి సమాజం ఇచ్చే పెళ్లి అనే సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు. సమాజం విధించే కట్టుబాట్ల కంటే వ్యక్తిగత ఇష్టాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. పెళ్లి అనే ట్యాగ్ లేకుండానే పిల్లల్ని కనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. భారత సాంప్రదాయ వివాహ పద్ధతులపై దివ్య సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

