epaper
Thursday, March 5, 2026
epaper

తిరుమల పవిత్రతకు విఘాతం: మరో వివాదంలో దివ్వల మాధురి!

కలం, వెబ్​ డెస్క్​ : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై దివ్వల మాధురి (Divvala Madhuri) మరోసారి వివాదానికి తెరలేపారు. గతంలో శ్రీవారి సన్నిధిలో రీల్స్ చేసి భక్తుల ఆగ్రహానికి గురైన ఆమె, అపచారాలు చేయనని క్షమాపణలు చెప్పినప్పటికీ, తాజాగా మరో వివాదాస్పద చర్యతో వార్తల్లో నిలిచారు. ఈసారి బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్ హౌస్‌లో నిర్వహించడం కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం కొండపైకి కేకులు తీసుకువెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ, యథేచ్ఛగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకోవడం గమనార్హం.

ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన చోట ఇలాంటి వేడుకలు జరపడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు భద్రతా వలయాన్ని దాటుకుని కేకు కొండపైకి ఎలా చేరిందనే అంశంపై టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి రీల్స్ చేసిన వివాదం మరువక ముందే, మాధురి (Divvala Madhuri) చేసిన ఈ తాజా పనితో అధికారులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!