బాండ్ల‌పై సంత‌కాలు.. ధ్రువ్ రాఠీ, అభిజిత్ క్లారిటీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో అరెస్ట్ అయిన సంద‌ర్భంగా యూట్యూబ‌ర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee), సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) విడుద‌ల‌కు ముందు పీస్ బాండ్ల‌పై సంత‌కాలు చేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై వీరిద్ద‌రూ స్పందించారు. అసలు తాము ఎలాంటి బాండ్ల‌పై సంత‌కాలు చేయ‌లేద‌ని ఎక్స్ వేదిక‌గా వేర్వేరు పోస్టుల్లో తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సంద‌ర్భంగా విడుద‌ల‌కు ప‌లు ష‌ర‌తులు పెట్టార‌ని, ఎలాంటి ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేయ‌బోమ‌ని హామీ ఇస్తూ శాంతి ఒప్పందంపై సంత‌కాలు తీసుకున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

అయితే తాను ఎలాంటి బాండ్‌పై సంత‌కం చేయ‌లేద‌ని, మ‌ళ్లీ వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలుపుతాన‌ని అభిజిత్ దీప్కే స్ప‌ష్టం చేశారు. ఇక ధ్రువ్ రాఠీ కూడా తాను ఎలాంటి బాండ్‌పై సంత‌కం చేయ‌లేద‌న్నారు. అలాగే ఎలాంటి హామీల ప‌త్రంపైనా సంత‌కం చేయ‌లేద‌ని చెప్పారు. త‌న‌ను విడుద‌ల చేసేందుకు ఎలాంటి ష‌ర‌తులు విధించ‌లేద‌ని వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>