కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన (Janasena) పార్టీ సిద్ధమవుతోంది. ఎన్నికలలో అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పనకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహం, విధివిధానాలపై కమిటీ కసరత్తు చేయనుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు జనసైనికులు, వీర మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విధివిధానాలను రూపొందించనుంది. పార్టీ నాయకుల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని కమిటీ తన నివేదికను రూపొందించనుంది.
కమిటీ సభ్యులు
1. మండలి బుద్ధ ప్రసాద్
2. టీ. శివ శంకర్
3. కొండల దుర్గేష్
4. వల్లభనేని బాలశౌరి
5. బొలిశెట్టి శ్రీనివాస్
6. దేవ వరప్రసాద్
7. సీమల వెంకటకృష్ణ యాదవ్
8. కొమ్మి లోకం మాధవి
9. పంతం నానాజీ ధర్మరాజు
10. చిలకం మధుసూదన్ రెడ్డి
11. కోటపాటి గోపింద్రావు (చినబాబు)
12. సామినేని ఉదయభాను
13. యనమల భాస్కర్
14. కొరికొన రవి కుమార్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ విధివిధానాలను రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

