కేటీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ మద్దతు!

కలం, వెబ్ డెస్క్: డీ లిమిటేషన్ బిల్లు (Delimitation Bill)కు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కీలక ప్రకటన చేశారు. ‘డీ లిమిటేషన్‌పై మేం ఎప్పుడూ పూర్తి స్పష్టతతోనే ఉన్నాం. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకోం. కచ్చితంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం వాటా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచుతూ.. 2051 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని భరోసానిచ్చేలా ప్రతిపాదనలు చేస్తోంది. దీని ప్రకారం, తెలంగాణలోని లోక్‌సభ సీట్లు 17 నుంచి 26 సీట్లకు పెరుగుతాయి. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా ముగ్గురు రాజ్యసభ ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు. మహిళలకు రిజర్వేషన్ల బిల్లును సమర్థించి, అమలు చేసే విషయంలోనూ కట్టుబడి ఉన్నాం’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రాంతీయ పార్టీల మద్దతు..

డీ లిమిటేషన్ బిల్లు(Delimitation Bill)కు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ మద్దతు తెలుపుతోంది. డీఎంకే ఇప్పటికే ఓకే చెప్పగా, తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా అంగీకరించింది. గులాబీ పార్టీకి లోక్‌సభలో ఎంపీలు లేకపోయినా, రాజ్యసభలో మాత్రం ముగ్గురున్నారు. వైసీపీ ఇప్పటికే మద్దతు తెలుపుతున్నట్లు పరోక్షంగా ప్రకటించేసింది. ఈ నెల 30 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. మరికొన్ని పార్టీలు కూడా కేంద్రానికి మద్దతు తెలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తోంది.

Also Read : డీ లిమిటేషన్‌ ఒప్పుకోం.. బీజేపీ టార్గెట్ అదే: ఖర్గే

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>