డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ మృతి

కలం, నల్లగొండ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ (Madhusudan) తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మృతి చెందారు. సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన మధుసూదన్ గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థల్లో పని చేశారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా మన్ననలు పొందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఛాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స చేస్తున్న క్రమంలోనే.. మరో సారి గుండె పోటు రావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. వరుసగా మూడు సార్లు స్ట్రోక్ వచ్చినట్లు ప్రకటించారు. మధుసూదన్ స్వస్థలం నల్లగొండ జిల్లా.

సీఎం, డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి..

మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయతీ గల పాత్రికేయడిని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అపోలో ఆసుపత్రిలో మధుసూదన్ మృతదేహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి.. నివాళులర్పించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>