Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం సభ రైతు జాతర కావాలి.. భట్టి ఆదేశాలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఈ నెల 10వ తేదీన ఖమ్మం జిల్లాలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సభ ఒక ‘రైతు జాతర’లా సాగాలని, అందుకు తగినట్లుగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఆయన జిల్లా అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సమయంలో రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ప్రతిఫలంగా ఈ కృతజ్ఞతా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యేలా ప్రతి గ్రామం నుండి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని, వారి రవాణా కోసం ఆర్టీసీ బస్సులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ​సభా ప్రాంగణంలో ప్రోటోకాల్, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మండలాల వారీగా వాహనాల పార్కింగ్ స్థలాలను, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ముందే ఖరారు చేయాలన్నారు. అలాగే సభకు వచ్చేవారి కోసం ప్రతి గ్యాలరీ వద్ద నిరంతరాయంగా తాగునీరు అందేలా చూడాలని, మొబైల్ టాయిలెట్లతో పాటు పారిశుద్ధ్య ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>