Mobile Popup Ad
Mobile Popup Ad

పరీక్షలో కాపీ కొట్టి, ఆపై ప్రిన్సిపాల్‌పై దాడి చేసి!

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా (Bhainsa) పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. ఓ విద్యార్థి ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రంలో చోటుచేసుకున్న ఈ సంఘటన విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన పరీక్షలో ఓ విద్యార్థి కాపీ కొడుతూ ప్రిన్సిపాల్‌కు పట్టుబడ్డాడు. ఈ విషయంపై విద్యార్థిని ప్రశ్నించగా, అతడు ఆగ్రహానికి గురై ప్రిన్సిపాల్‌ను తోసివేశాడు. జవాబు పత్రాన్ని చించేసి, దాడి చేశాడు.

ఈ ఘటనపై ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం కళాశాల అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>