నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ ఎల్‌ఎఫ్‌ఎన్‌ఏ పరీక్ష నిర్వహణ

కలం, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వయోజనులకు ఆదివారం ఉల్లాస్ ఎల్‌ఎఫ్‌ఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో, జిల్లా కేంద్రంలోని శాంతినగర్, సాయినగర్, వైయస్సార్ నగర్ కాలనీలో నిర్వహించిన పరీక్షను డీఈఓ దర్శనం భోజన్న (DEO Bhojanna) పరిశీలించారు.

చదువు రాని వయోజనులకు అక్షరాస్యత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించిన వారికి జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ద్వారా ధృవీకరణ పత్రాలను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో ఉల్లాస్ జిల్లా ఇంచార్జి జి. శ్రీనివాస్ రెడ్డి, సీఎంఓ ఎన్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>