PRTSపై సీఎం రేవంత్ స‌మీక్ష‌.. కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)పై ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌మీక్ష‌ నిర్వహించారు. ఈ మీటింగ్ కు పీఆర్టీఎస్ (PRTS) సీఎంవో కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్, హైద‌రాబాద్ మెట్రో ఎండీ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్, మెట్రో అద‌న‌పు ఎండీ అజిత్ రెడ్డి, సైబ‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సృజ‌న‌, జీ హెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు పనుల పురోగతిని అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

నగరంలో ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టాండ్ వరకు ఒక లైన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ నుంచి బేగంపేట్ కు కలుపుతు మరొక లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. నక్లెస్ రోడ్ లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పారు. కూకట్ పల్లి హోసింగ్ బోర్డు కాలనీ (KPHB) మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు లైన్ ను వెంటనే చేపట్టాలని చెప్పారు. గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు డిసెంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>