SRH జట్టులో తెలంగాణ ఆటగాళ్లకు చోటివ్వాలి!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో‌ (Sunrisers Hyderabad) స్థానిక తెలంగాణ క్రీడాకారులకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ నేత అలిపురం వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఓయూ (OU) విద్యార్థులు బంజారాహిల్స్‌లోని జట్టు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. స్థానిక ప్రతిభావంతులపై వివక్ష చూపడం తగదని, మన క్రీడాకారులకు ప్రాధాన్యం ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జట్టు యాజమాన్యం వెంటనే స్పందించి స్థానిక కోటాను అమలు చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానిక తెలుగు ఆటగాళ్లకు అవకాశం కల్పించడం వల్ల ఫ్రాంచైజీకి బలమైన బ్రాండ్ వాల్యూ, కనెక్టివిటీ పెరుగుతాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక ఆటగాళ్లు జట్టులో ఉంటే అభిమానులకు జట్టుపై ఉన్న మక్కువ రెట్టింపు అవుతుంది. అలాగే ఉప్పల్ స్టేడియం లాంటి పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంటుంది. దీంతో కీలక సమయాల్లో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో తెలుగు కుర్రాళ్లకు ప్రోత్సాహం లభించి, భవిష్యత్తులో జాతీయ స్థాయికి ఎదిగేందుకు దోహదపడొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>