‘సారీ చెప్పండి’.. వైఎస్.భారతీ రెడ్డి డిమాండ్!

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్.భారతీ రెడ్డి (YS Bharathi) గూగుల్‌, మెటా, ఎక్స్‌, యూట్యూబ్‌లకు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా థింక్‌ ఆంధ్ర, ఎం9 అనే మీడియా సంస్థలు తప్పుడు కథనాలు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నాయని వివరించారు. వెంటనే ఆ కథనాలు, పోస్టులను డిలేట్ చేయించి.. ఆయా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరారు. అంతేగాకుండా, తనపై నిరాధార కథనాలు, పోస్టులు పెట్టినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని లీగల్‌ నోటీసుల్లో డిమాండ్ చేశారు.

కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

జగన్ కుటుంబసభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్న థింక్‌ ఆంధ్ర, ఎం9 అనే యూట్యూబ్ ఛానళ్లపై వైసీపీ ఫిర్యాదు చేసింది. కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్‌లో జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు గొల్ల మధు శేఖర్ తదితరులు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also: బీజేపీ బ్రహ్మాస్త్రానికి బ్రేక్ వేసిన ‘ఇండియా’

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>