కలం, కరీంనగర్ బ్యూరో : భారత విద్యార్థి ఫెడరేషన్ చొప్పదండి (SFI Choppadandi) మండల కమిటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చొప్పదండి మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో నవంబర్ 12, 13 తేదీలలో కబడ్డీ, కోకో, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శివ నిఖిల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం కోసం SFI ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఎదగాలని సూచించారు.
అదేవిధంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. SFI కేవలం విద్యారంగ సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కోసం ఇలాంటి బహుముఖ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, మహేందర్, కౌశిక్, నితిన్, శిశాంత్, అభిరామ్, అర్ఫన్, మణికంఠ, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

