సమీర్ రిజ్వీకి డీసీ కోచ్ హేమాంగ్ చురకలు.. క్యాంప్‌లో సరదా సీన్స్

క‌లం, వెబ్ డెస్క్‌: సమీర్ రిజ్వీ (Sameer Rizvi)కి ఢిల్లీ క్యాపిటల్స్(DC) కోచ్ హేమాంగ్ బదాని (Hemang Badani) చురకలు వేయడంతో 2026 ఐపీఎల్ (IPL) ప్రీ–సీజన్ క్యాంప్‌లో సరదా వాతావరణం కనిపించింది. యువ ఆటగాడి బౌలింగ్ మాటలకు కోచ్ ఇచ్చిన చమత్కార స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనింగ్ సెంటర్‌లో సమీర్ రిజ్వి తనను తాను మిస్టరీ స్పిన్నర్‌గా అందరికీ పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా తాను ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్‌తో పాటు క్యారమ్ బాల్ కూడా వేయగలనని తెలిపాడు. దీనిపై స్పందించిన హెడ్ కోచ్ హెమాంగ్ బదాని ఆ మిస్టరీ అలాగే ఉండనివ్వాలని సరదాగా సూచించాడు.

ఈ మాటల తూటాలను డీసీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రిజ్వీ బౌలింగ్ గురించి మాట్లాడిన వెంటనే బదాని స్పందన ట్రైనింగ్ సెంటర్‌లో నవ్వులు పూయించింది. ఇక గత సీజన్‌ ఐపీఎల్‌లో DC ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో ఈసారి జట్టులో పెద్ద మార్పులు జరిగాయి. అక్సర్ పటేల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. మొదట వరుసగా నాలుగు విజయాలు సాధించిన జట్టు, ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయింది. చివరకు 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. మొత్తంగా చూస్తే, క్యాంప్‌లో చోటు చేసుకున్న ఈ సరదా ఘటన జట్టులో ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది. రాబోయే సీజన్‌లో డీసీ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>