కిలేడీలు.. అందరూ చూస్తుండగానే పర్సు మాయం

కలం, ఖమ్మం బ్యూరో : పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇద్దరు లేడీ కిలాడీలు పర్సు కొట్టేసి జారుకున్నారు. సీసీ కెమరాకు చిక్కి ఉండకపోతే వారిని పట్టుకోవడం ఎవరి తరం అయ్యేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి (Tekulapalli) లో సోమవారం జరిగిన ఈ ఘటన కు సంబంధించిన సీసీ కెమరా దృశ్యాలు మంగళవారం వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు.

బోడ్ గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళ టేకులపల్లి (Tekulapalli)లోని బాలాజీ మెడికల్ షాపులో మెడిసిన్స్ కొనుగోలు చేస్తుండగా, ఇద్దరు మహిళలు ఆమె చేతిలోని కవర్ ను బ్లేడ్ తో కట్ చేసి రూ.10 వేలు దొంగతనం చేసి అక్కడి నుంచి జారుకున్నారు. కొద్ది సేపటి తర్వాత పర్సు పోయిన విషయం గమనించిన శ్రీలత మెడికల్ షాపులో వాకబు చేసింది. మంగళవారం సీ సీ కెమరా దృశ్యాలను పరిశీలించిన మెడికల్ షాపు యజమాని…ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడ్డట్టు గుర్తించారు. బాధిత మహిళకు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>