Mobile Popup Ad
Mobile Popup Ad

డేటింగ్ బర్నౌట్ నుంచి బయటపడాలా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు..!

కలం, వెబ్ డెస్క్ : ఈరోజుల్లో డేటింగ్ యాప్స్ వాడకం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో డేటింగ్ బర్నౌట్ (Dating Burnout) కూడా పెరుగుతోంది. సరైన వ్యక్తిని వెతుకుతూ కొత్త కొత్త పరిచయాలు చేసుకోవడం, మళ్లీ నిరాశ చెందడం చాలామందిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. స్వైప్ రైట్ కల్చర్ మధ్య ఇప్పుడు చాలామంది ఎమోషనల్‌గా ఖాళీ అయిన భావనతో ఇబ్బంది పడుతున్నారు. ఎమోషనల్ వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ కోటోకు చెందిన రిలేషన్‌షిప్ కోచ్ హేమా మిశ్రా ఈ సమస్యపై కీలక సూచనలు ఇచ్చారు. ఆమె చెప్పిన ప్రకారం.. డేటింగ్ బర్నౌట్ అంటే మనసు, భావోద్వేగాలకు సరైన విశ్రాంతి దొరకకపోవడం. కొత్త వ్యక్తులతో మాట్లాడటం, త్వరగా అటాచ్ అవడం, తర్వాత నిరాశ చెందడం వల్ల మెదడు స్వయంగా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుందని తెలిపారు.

అందుకే చాలామందికి ఆసక్తి తగ్గడం, చిరాకు రావడం, భావోద్వేగంగా ఖాళీగా అనిపించడం జరుగుతుందని వివరించారు మిశ్రా. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ముందుగా బ్రేక్ తీసుకోవాలని హేమా సూచించారు. కొంతకాలం డేటింగ్ యాప్స్‌కు దూరంగా ఉండటం వల్ల మనసుకు విశ్రాంతి దొరుకుతుందని తెలిపారు. ఈ సమయంలో మనకు ఆనందం ఇచ్చే పనులపై దృష్టి పెట్టాలని చెప్పారు. అవసరమైతే ఒంటరిగా ట్రిప్ వెళ్లడం కూడా మంచిదేనన్నారు. అలాగే డేటింగ్‌లో బౌండరీలు చాలా ముఖ్యమని హేమా పేర్కొన్నారు. మొదట్లోనే పూర్తిగా ఎమోషనల్‌గా ఇన్వెస్ట్ కాకూడదని తెలిపారు.

ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలని, నెమ్మదిగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఇలా చేయడం వల్ల మానసిక అలసట తగ్గుతుందని వివరించారు. డేటింగ్ విషయంలో ఆలోచనా విధానం కూడా మార్చుకోవాలని హేమా చెప్పారు. “ఈ రిలేషన్ వర్కవుతుందా?” అని ఆలోచించడం కంటే.. “ఇక్కడ నేను కంఫర్ట్‌గా ఉన్నానా?” అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని తెలిపారు. ఏదైనా సరైనదిగా అనిపించకపోతే బలవంతంగా కొనసాగించకుండా ముందుకు వెళ్లడం మంచిదని సూచించారు.

త్వరగా ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకోవద్దని కూడా హెచ్చరించారు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలు, మన కంఫర్ట్ లెవల్ అర్థమయ్యే వరకు కొంత సమయం తీసుకోవాలని అన్నారు. డేటింగ్ యాప్స్‌లో ఫిల్టర్లు వాడటం కూడా ఉపయోగకరమని హేమా వివరించారు. ప్రతి ఆకర్షణీయమైన ప్రొఫైల్‌కు స్వైప్ చేయకుండా.. మన విలువలు, అవసరాలకు సరిపోయే వ్యక్తులను మాత్రమే ఎంపిక చేసుకోవాలని సూచించారు హేమా.

Read Also: కిడ్నీలో రాళ్లు కరిగిన తర్వాత మళ్లీ ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>