Mobile Popup Ad
Mobile Popup Ad

మమ్మల్ని ఇంటికి పంపండి: విండీస్ కోచ్ డారెన్ సమీ ఆవేదన

కలం, వెబ్ డెస్క్: భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశానికి వెళ్లేందుకు మార్గం కోసం ఎదురుచూస్తోంది. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో కరేబియన్ ఆటగాళ్ల ఇంకా ఇండియాలోనే ఉన్నారు. వారి భద్రతకు ఐసీసీ అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ వాళ్లు ఇంటికి ఎప్పుడు వెళ్లేది అనేది మాత్రం ఇంకా తేలలేదు. దీనిపై వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ (Daren Sammy)  సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. కనీసం తమ ప్రయాణం ఎప్పుడు ఉంటుందో ఒక అప్‌డేట్ ఇవ్వాలని, తమకు కేవలం ఇంటికి వెళ్లాలని ఉందని ఆయన పేర్కొన్నారు. మార్చి 1న భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత విండీస్ జట్టు కోల్‌కతాలోనే ఉండిపోయింది. ఐసీసీ చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ ప్రయాణ తేదీపై స్పష్టత రాలేదు.

మరోవైపు జింబాబ్వే జట్టుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ జట్టు సభ్యులు ఢిల్లీ నుండి విడతల వారీగా హరారేకు బయలుదేరారు. గతంలో దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన జింబాబ్వే ప్రయాణం రద్దు కావడంతో, ఇప్పుడు ఇథియోపియా మీదుగా వారిని పంపిస్తున్నారు. ఇక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సౌతాఫ్రికా జట్టు కూడా ప్రస్తుతం తమ తిరుగు ప్రయాణం కోసం వేచి చూస్తోంది. గురువారం జరిగే సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ ఓడిపోతే, ఆ జట్టు కోసం కూడా ఐసీసీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఆటగాళ్ల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: గ్యాస్​ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>