కలం, వరంగల్ బ్యూరో : నేడు విడుదలైన యూపిఎస్సీ (UPSC 2026) ఫలితాల్లో ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగరం మండల కేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ (Dainampalli Praveen Kumar) 793వ ర్యాంక్ సాధించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ పారిశుధ్య కార్మికురాలైన నాన్నమ్మ వద్ద ఉంటూ విద్యాభ్యాసం చేశాడు. తాను కష్టపడి సాధించిన విజయం ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల గ్రూప్-1 పరీక్షలో 105వ ర్యాంక్ సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ప్రవీణ్ తాజాగా విడుదలైన యూపిఎస్సీ పరీక్షలో ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: స్కూల్ బస్సులకు ‘ఫిట్‌నెస్’ లేకుంటే కఠిన చర్యలు: మంత్రి పొంగులేటి
Follow Us On: Youtube

