Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్రంలో నర్సింగ్ విద్యకు ప్రాధాన్యతనిస్తున్నాం: మంత్రి రాజనర్సింహా

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నర్సింగ్ విద్యకు రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. నర్సింగ్ విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నర్సింగ్ ఎడ్యుకేషన్ బలోపేతం చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో జోగిపేట నర్సింగ్ కాలేజ్, కాలేజీ హాస్టల్ భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సింగ్ కాలేజీ, హాస్టల్ లను త్వరలో ప్రారంభించేందుకు సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాలను పరిశీలించిన అనంతరం పలు సూచనలను చేశారు.అనంతరం నర్సింగ్ కాలేజీ విద్యార్థిని లతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>