కలం, చండూరు: చండూరు (Chandur) మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ (Drainage) పైకప్పు పగిలింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నో సార్లు చెప్పినా వినిపించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చీకటైతే చాలు ఏమి జరుగుతుందోనని ఆ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఈ మోరీ పైకప్పు పగలడంతో మోరీ దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు నెలల నుంచి ఈ విషయంపై ప్రస్తావించిన రేపు మాపు అని కాలం గడుపుతున్నారని ఆ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

