న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీల‌క విజ్ఞప్తి

క‌లం, వెబ్‌డెస్క్‌: బంగాళాఖాతంలో అల్ప పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. జిల్లాల్లో వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. హైద‌రాబాద్‌లో సైతం భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Traffic Police) అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌రంలో వ‌ర్షం కార‌ణంగా ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉండేందుకు కంపెనీల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.

సైబ‌రాబాద్ ప‌రిధిలో ఉన్న కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను మ‌ధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగా ఇళ్ల‌కు పంపించాల‌ని అధికారులు సూచించారు. దీంతో సాయంత్రానికి ట్రాఫిక్ త‌క్కువ‌గా ఉండ‌టంతో పాటు త‌మ విధుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని పేర్కొన్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రజలు అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని కోరారు. న‌గ‌ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాల‌ని, వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also: జెన్ జీ.. వయా ఇన్‌స్టా.. మోదీ న‌యా ప్లాన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>