ఉధృతంగా గంగమ్మ వాగు.. నిలిచిపోయిన రాకపోకలు

కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హవేలిఘణపూర్ మండలం దూప్ సింగ్ తండా శివారులోని గంగమ్మ వాగు (Gangamma Vaagu) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వాగు పొంగిపొర్లుతుండటంతో ధూప్ సింగ్ తండా – హవేలిఘణపూర్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, దానికి అనుసంధానంగా నిర్మించాల్సిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో వర్షాకాలంలో వాగు పొంగినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి తమ కష్టాల నుండి గట్టెక్కించాలని తండా ప్రజలు కోరుతున్నారు.

Read Also: నత్తనడకన ‘సర్’.. మిగిలింది ఆరు రోజులే!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>