సీవీ ఆనంద్ ఆన్ డ్యూటీ.. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరణ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పండితులు సీవీ ఆనంద్‌కు ఆశీర్వచనం అందించి, నూతన బాధ్యతలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

బాధ్యతలు చేపట్టిన తక్షణమే పలువురు ఉన్నతాధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంపై సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పలు కీలక సంస్కరణలు చేపట్టిన ఆయన రాష్ట్రస్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని నడిపించనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>