కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సీపీఎం మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మధు సతీమణి సుమతి అనారోగ్య కారణాల వల్ల మహబూబ్‌నగర్ (Mahbubnagar) లోని సుశ్రుత హాస్పిటల్ (Sushrutha Hospital) లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కామ్రేడ్ డాక్టర్ నారాయణ (CPI Leader Narayana) సోమవారం ఉదయం సుమతిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి బి.బాల్ కిషన్, మాజీ కార్యదర్శి పరమేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె. పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఉన్నారు.

