దక్షిణాది రాష్ట్రాలకు బిజెపి అన్యాయం : సీపీఐ

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సిపిఐ ప్రచార జాతా నిర్వహించి ముగింపు రామడుగు (Ramadugu) మండలంలో జరిగిందని, 9 రోజులు పాటు జరిగిన ప్రచార జాత విజయవంతంగా రామడుగు మండలం లో ముగిసిందని పంజాల శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం రామడుగు మండలం గుండి, రామడుగు, గోపాలరావుపేట లో జరిగిన ప్రచార జాతాకు సిపిఐ మండల కార్యదర్శ ఉమ్మెంతల రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ జాతాకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యా, వైద్యాన్ని పేదలకు అందనంత దూరం చేస్తుందని, కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుందని ఆరోపించారు. సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో దిల్లీలో సెప్టెంబర్ 1న పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమం జరగనుందని, రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వ విధానాలపై మరిన్ని పోరాటాలకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

జాతాలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జాతా కో ఆర్డినేటర్స్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, రామడుగు మండల సిపిఐ కార్యదర్శి ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, మాజీ మండల కార్యదర్శి గోడిషెల తిరుపతి గౌడ్, గంటె రాజేశం, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బామండ్లపెల్లి యుగేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ చారి, సిపిఐ మండల నాయకులు వేముల మల్లేశం, కనకయ్య, నాయకులు బాకం ఆంజనేయులు, రమేశ్​, బీర్ల స్వాతి, స్వప్న, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>