కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు.. భార్యాభ‌ర్త‌లు గ‌ల్లంతు!

క‌లం, వెబ్ డెస్క్‌: నల్గొండ (Nalgonda) జిల్లాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం ముకుందాపురం సమీపంలో శనివారం రాత్రి ఓ కారు నాగార్జున సాగర్ ఎడమ కాలువ (Nagarjuna Sagar Canal) లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభ‌ర్త‌లు కాలువ‌లో గల్లంతయ్యారు. త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామానికి చెందిన తల్లాం పుల్లయ్య, పద్మ దంపతులు మిర్యాలగూడ నుంచి తమ సొంతూరికి తిరుగు ప్రయాణం అవుతుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. కారు అదుపుతప్పి కాలువలో పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే నిడమనూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నిపుణులైన ఈతగాళ్ల సహాయంతో కాలువలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>