హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం.. అమరావతినీ చేస్తాం: సీఎం

కలం, వెబ్ డెస్క్: అమరావతి నిర్మాణంలో భాగంగా ‘ఇ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌’ (Seed Access Road) రెండో దశను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు సీడ్ యాక్సెస్ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కారిడార్‌ను 60 మీటర్ల వెడల్పుతో, 9 లేన్లతో, 3 దశల్లో మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో రూ.1,519 కోట్లుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అలాగే విజయవాడ-మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జినిసైతం సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

అమరావతి రైతుల త్యాగం కాదు.. వారి స్ఫూర్తి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతి రైతుల త్యాగమే కాదు.. అది వారి స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నడిబొడ్డున గుంటూరు జిల్లా ఉందని, ఇక్కడే అమరావతి నగరం సరియైందని మరోమారు స్పష్టం చేశారు. ఈ జిల్లాకు కింద 14 జిల్లాలు పైన 14 జిల్లాలు ఉన్నాయన్నారు. చిన్న పిల్లాడిని అడిగినా అమరావతి రాష్ట్రం నడిబొడ్డున ఉందని చెబుతాడని అన్నారు. విజయవాడలోనో, గుంటూరులోనో 50 ఎకరాల్లో సెక్రటేరియట్ కట్టేయొచ్చు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకొచ్చామని అన్నారు.

హైదరాబాద్ ను డెవలప్ చేశాం..

తనకెప్పుడూ రాజధాని ఎక్కడ కట్టాలి అని కన్ఫ్యూజన్ ఉండేదని సీఎం (CM Chandrababu) చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రాంతంలోనే రాజధాని కట్టాలని రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని.. అందుకే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఏపీ రాజధానిని నిర్మించే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడు.. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆనాడు హైదరాబాద్ ను నిర్మించామని అన్నారు. హైదరాబాద్ ఆదాయం పెరగటానికి తాను చేసిన అభివృద్దే కారణమని చెప్పుకొచ్చారు. తాను చేసిన హైదరాబాద్ అభివృద్ధితో తలసరి హైయెస్ట్ ఆదాయంగా తెలంగాణ ఉందని.. అందుకు తాను గర్విస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని.. అంతకు మించిన ఉత్సాహంతో అమరావతినీ డెవలప్ చేస్తామని అన్నారు.

రైతులు లేకపోతే రాజధానే లేదు..

ఒక కుటుంబానికి మంచి ఇల్లు ఉండాలి.. అలాగే ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమను నమ్మి రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. రైతులు లేకపోతే రాజధానే లేదని అన్నారు. హైదరాబాద్ లో హై టెక్ సిటీ కడితే.. ఎల్ అండ్ టీ సంస్థను పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేయించిన తరువాత ఫైనలైజ్ చేశామని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి, సైబరాబాద్ నిర్మాణానికి అమెరికాకు 15 రోజులు వెళ్లాలని గుర్తు చేశారు. ఇప్పుడు రాజధాని అమరావతి కోసం మొట్టమొదటి సరిగా సింగపూర్ కి వెళ్లామని స్పష్టం చేశారు. సింగపూర్ దేశం మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకు పోతుందని.. అంతే వేగంతో అమరావతిని డెవలప్ చేయాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>