Mobile Popup Ad
Mobile Popup Ad

మంచి నీరు ఇలా.. త్రాగేదెలా?

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్ దుర్షేడు వాసుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందనడానికి ఈ చిత్రాన్ని చూస్తే అద్దం పడుతుంది. ముఖ్యంగా దుర్షేడు వాసులకు త్రాగునీటి కష్టాలు నెలకొని ఉన్నాయి. డివిజన్ లో మూడు వాటర్ ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులకు ఈ బావి నుండి నీరు సరఫరా అవుతుంది. త్రాగు నీరు అందించే.. ఉన్న ఒక్క బావికూడ నిర్వహాణ లేక అపరిశుభ్రంగా మారింది. బావి పైన కప్పు లేకుండా చెత్త చేదారంతో నిండి మురికికుపంగా మారింది. మరో వైపు ఆబావి ఎగువ భాగంలో స్మశానం ఉండడంతో పాటు.. ప్రక్కనే వాగు పారుతూ ఉంటుంది.

స్మశానంలో వదిలివేసిన చెత్త గాలి ద్వారా మొత్తము బావిలో పడిపోతుంది. అంతే కాకుండా మూగ జీవాల కలేబెరాలను వాగులో వేయడం ద్వారా ఆనీరు కలుషితంగా మారుతుంది. కనీసం బావిలో బ్లీచింగ్ పొడి చల్లే నాథుడే లేడని డివిజన్ వాసూలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని వార్డుల్లో బోర్ల రిపేర్లు కూడా ఉన్నాయి. ఓక బోర్ వేసి ప్రజలకు త్రాగు నీరు అందించాలని.. దాంతో పాటు, ఈ బావికి పై కప్పు వేసి సరియగు నిర్వహాణ చేస్తూ ప్రజలకు శుద్ధమైన త్రాగు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>