కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ (Zaheerabad Municipality) చైర్మన్ పీఠంను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ యూనుస్ ను చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొత్త కాపు శిరీషను (Kothakapu Sirisha) ఎన్నుకున్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులలో బిఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 వార్డులు గెలిచారు. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్ ఎక్స్ అఫిషియా మెంబెర్స్ గా నమోదు చేసుకోవడంతో 39 ఓట్లకు పెరిగింది. 20 మంది సభ్యులు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి మద్దతు పలకడంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ గెలుచుకుంది.
Read Also: కొత్తగూడెంలో మావోయిస్టు లొంగుబాటు
Follow Us On: X(Twitter)


