Mobile Popup Ad
Mobile Popup Ad

పాల్వంచలో కృష్ణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయాలి: కాంగ్రెస్ సేవాదళ్

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ తొలి ఉద్యమకారుడు పోటు కృష్ణమూర్తి (Potu Krishnamurthy) విగ్రహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha)లో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె. అహ్మద్ (SJK Ahmad) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాల్వంచ పట్టణంలో పోటు కృష్ణమూర్తి సతీమణి పోటు లక్ష్మిని అహ్మద్ సన్మానించి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కేటీపీఎస్ ప్రాంగణంలో ఆంధ్రా పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా “గో బ్యాక్ ఆంధ్రా” అంటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు కృష్ణమూర్తి అని పేర్కొన్నారు. 1969లో 14 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై కృష్ణమూర్తి చేసిన సేవలను, ఉద్యమాన్ని స్మరించుకొని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పాల్వంచలో స్థలాన్ని కేటాయించి ఆయ‌న‌ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అహ్మద్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పోషించిన కీలక పాత్రను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, జారే బిక్షం, ఆళ్ల రాఘవ, పోటు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>