కలం, యాదగిరిగుట్ట : పోచంపల్లి మండలం అబ్దుల్లాపూర్ నగర్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanti) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే పనుల పురోగతి, సర్వే నిర్వహణ విధానం, భూ సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాలను పరిశీలించారు.
రీసర్వే పనులను నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి సుజాత, మండల సర్వేయర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

