Mobile Popup Ad
Mobile Popup Ad

‘మైనార్టీ విభాగాన్ని బలోపేతం చేద్దాం‘

కలం, జనగామ: కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ పిలుపునిచ్చారు. జనగామ (Jangaon) జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మైనారిటీ నాయకుల సమావేశంలో ఆమె పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకుల సమస్యలు, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా వారి అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

త్వరలో పూర్తి స్థాయి కమిటీలు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మైనారిటీ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా (Jangaon) అధ్యక్ష పదవికి అర్హులైన నాయకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ప్రకటించారు. ఆసక్తి కలిగిన నాయకులు రాబోయే రెండు రోజులలో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్నీ బేగం, అర్జుల సుధాకర్ రెడ్డి, చింతకింది మల్లేష్, ఇస్మాయిల్, తారీక్, మాజిద్ అప్సర్, అలీముద్దీన్, అజారుద్దీన్, ఖాదర్ షరీఫ్, గౌస్, ముజ్జు, షకీల్, అక్రమ్, కమలుద్దీన్, ఆసిఫ్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: మెట్రో ఫుట్‌పాత్‌ల లీజుపై హైకోర్టు ఆగ్రహం.. GHMCకి నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>