Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంపై రెచ్చిపోయిన రేగా.. కేసులు నమోదు చేసిన కాంగ్రెస్ శ్రేణులు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri) జిల్లా రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కాక రేపుతోంది. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantharao) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “తొండ ఎంత ఎగిరినా కంచె వరకే, రేవంత్ ఎంత ఎగిరినా రెండేళ్లే” అంటూ విమర్శించడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ వ్యాఖ్యలతో పాటు ఆయన చేసిన కామెంట్స్ కు సంబంధించిన క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ఘటనతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు తీవ్రంగా స్పందించి కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు పోలీస్ స్టేషన్లలో రేగాపై ఫిర్యాదులు నమోదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని, బాధ్యత గల పదవిలో ఉన్నవారు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే సమాజం ఒప్పుకోదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి వెంటనే బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావును అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>