Mobile Popup Ad
Mobile Popup Ad

పార్టీ మారడానికి రేవంత్ రెడ్డి కారణం: జీవన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తాను పార్టీ మారడానికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ఆయనే ఫిరాయింపులను దగ్గరుండి ప్రోత్సహిస్తూ.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామంటున్నా.. రాహుల్ గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ సైతం ఒకప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించారని పేర్కొంటూనే.. 2014లో నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరిగాయని వివరించారు. అందుకే, కేసీఆర్ ఎమ్మెల్యేలను తీసుకోలేక తప్పలేదని సమర్థించారు.

అడ్డగోలుగా అప్పులు..

కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో అప్పులు చేయలేదని తాను అనడం లేదని.. తీసుకున్న అప్పులతో నీటిపారుదల ప్రాజెక్టులు కట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి ప్రాజెక్టులు కట్టడం లేదు కదా.. అని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకం ఒక్కటి అమలు చేస్తున్నారని.. అయితే, ఆర్టీసీకి మాత్రం బకాయిలు చెల్లించడం లేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>