పరిశ్రమలకు స్పీడ్‌గా పర్మిషన్లు ఇవ్వాలి : కలెక్టర్ ప్రావీణ్య

కలం, మెదక్ బ్యూరో : ప్రభుత్వం అమలు చేస్తున్న TG -iPASS విధానం ప్రకారం పరిశ్రమలకు స్పీడ్ గా పర్మిషన్లు ఇవ్వాలని సంగారెడ్డి (Sangareddy) కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ–టీఎస్ ఐపాస్ & సిఎస్‌ఆర్ నిధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులు TG -iPASS విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల జారీలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.

పరిశ్రమలు ఇచ్చే సిఎస్‌ఆర్ నిధులను విద్య, ఆరోగ్యం, హాస్టల్ సంక్షేమం లాంటి అత్యవసర రంగాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అత్యవసర అభివృద్ధి కార్యక్రమాలకు సిఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు కలెక్టర్ ప్రావీణ్య.

Read Also: బిహార్‌లో దారుణం.. వధువుపై కాల్పులు జరిపిన మాజీ ప్రియుడు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>