Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కలం, నిజామాబాద్ బ్యూరో: మంత్రి సీతక్క (Minister Seethakka) బుధవారం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇంచార్జి మంత్రి సీతక్క పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఆడిటోరియంను కలెక్టర్ సందర్శించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు సక్రమంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఏ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీడబ్ల్యూఓ పద్మ తదితరులు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>