ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

కలం, కరీంనగర్ బ్యూరో: లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంగనర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో 25వ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ఏరియా బుట్టి రాజారాం కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను డీఆర్ఓ స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇల్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలని తెలిపారు. జిల్లాలో బిల్లులు జమ కాని లబ్ధిదారుల వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణం పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ స్వామి, గృహ నిర్మాణ శాఖ అధికారులు డీఈ వెంకటరమణ, ఏఈలు ఊర్మిళ, వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>