భైంసా భవిష్యత్తుకు బాటలు వేయనున్న మాస్టర్‌ ప్లాన్‌: కలెక్టర్‌

కలం, బైంసా: భైంసా పట్టణ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ (Bhainsa Master Plan) కీలకంగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. బుధవారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ అమలుపై రెండో కన్సల్టేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Bhavesh Mishra) మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్‌పై సంబంధిత స్టేక్‌హోల్డర్లతో ఇప్పటికే కలెక్టరేట్‌లో తొలి కన్సల్టేటివ్ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

ప్రస్తుత ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు, సంబంధిత వర్గాలకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.తాజా గణాంకాల ప్రకారం భైంసా పట్టణ జనాభా సుమారు 60 వేల వరకు ఉందని, భవిష్యత్‌లో జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా పట్టణ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

2040 నాటికి పట్టణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, మైదానాలు, పార్కులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సహకారం, సూచనలతో భైంసా మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసి పట్టణ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేద్దామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.

మాస్టర్ ప్లాన్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్‌పై ఎవరికైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్దికీ, భైంసా సబ్‌ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>