కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గోదాముల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం వనపర్తి (Wanaparthy) మండలం చిట్యాల గ్రామ శివారులో ఉన్న లక్ష్మీ నరసింహ రైస్ మిల్ గోదామును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
అక్కడ కొనసాగుతున్న వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాం దగ్గర లారీలు ఎక్కువగా వేచి ఉన్న నేపథ్యంలో కొన్ని లారీలను ఇతర గోదాములకు డైవర్ట్ చేయాలని డీసీఎస్ఓను ఆదేశించారు. హమాలీలను ఎక్కువ మందిని సమీకరించి లారీలు ఎక్కువ రోజులు వేచి ఉండకుండా పని వేగంగా పూర్తి చేయాలన్నారు. డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్ ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ (Adarsh Surabhi) వెంట ఉన్నారు.
Read Also : ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. పలు అంశాలపై వినతిపత్రం
Follow Us On: Sharechat

