Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. పలు అంశాలపై వినతిపత్రం

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానితో చర్చించారు. పెండింగ్ లోని 8 అంశాలపై ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం అందించారు.

ఈ మేరకు హైదరాబాద్ తదుపరి అభివృద్ధి దశకు దోహదపడే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరిన సీఎం.. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం బందరు వరకు 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి సహకారం అందించాలన్నారు. పర్యావరణహిత, సుస్థిర రవాణా కోసం హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. హైదరాబాద్ చారిత్రక జీవనాడి అయిన మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలన్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీకి గుర్తింపు , నిధులు కేటాయించాలన్న సీఎం.. దక్షిణ తెలంగాణకు కీలకమైన జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ అనుమతులు, కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేసే ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఏఎంపీ (AMP), ఓసాట్ (OSAT) క్లస్టర్ల ఏర్పాటుపై, అలాగే తెలంగాణ విద్యార్థుల ఉన్నత విద్యా ఆశయాల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వినతిపత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>