జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ కాక్రోచ్ పార్టీ ‘థాలీ భజావో’..!

క‌లం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) మూడో రోజు నిర‌స‌న‌లు కొనసాగిస్తోంది. నీట్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. నిరసనల్లో భాగంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ డిప్కే పిలుపు మేరకు ‘థాలీ భజావో’ (Thaali Bajao) అంటూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ప్లేట్లు ప‌ట్టుకొని చ‌ప్పుడు చేస్తూ విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. అభిజిత్ డిప్కే ఆదివారం నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొని అదే వేదిక‌పై ప‌డుకున్నారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న లేవ‌గానే ఆందోళ‌న కొన‌సాగుతుంద‌ని, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>