Mobile Popup Ad
Mobile Popup Ad

బిర్యానీలో బొద్దింక.. 15 వేలు ఫైన్

కలం, మెదక్ బ్యూరో: బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన యువకుడు బొద్దింక చూసి షాక్ అయ్యాడు. సిద్దిపేటలోని (Siddipet) హయాత్ హోటల్‌లో బిర్యానీ (Biryani)లో బొద్దింక కనిపించడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై యాజమాన్యాన్ని అడిగితే సరైన సమాధానం ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. కస్టమర్ ఫిర్యాదు మేరకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ సూపర్ వైజర్ శ్రీకాంత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు శివ కుమార్, సత్యనారాయణ, EE అన్వేశ్ హోటల్ కిచెన్‌ను తనిఖీ చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ వాడుతున్నారని రూ. 15 వేల జరిమానా విధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>