కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ ప్రదానోత్సవానికి మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఆహ్వానించేందుకు టీఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆయనను కలిశారు. ఈ నెల 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని అత్యున్నతమైన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు‘ వరించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కార వేడుకలో పాల్గొని అవార్డును స్వీకరించాల్సిందిగా దిల్ రాజు ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం.

