పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తాం : మంత్రి పొంగులేటి

కలం/ఖమ్మం బ్యూరో : పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ముందుగా పాలేరులో రూ.5 కోట్లతో పాలేరు సరస్సు సుందరీకరణ పనులకు, తర్వాత మల్లాయిగూడెం నుండి ఆంజనేయస్వామి దేవాలయం దాకా రూ.కోటి 35 లక్షలతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలేరు లేక్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రజలు, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలం నాటికి మల్లాయి గూడెం గ్రామంలో రూ.కోటి 35 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు అభివృద్ధి పనులను వినియోగించుకోవాలన్నారు. మల్లాయిగూడెం గ్రామ పరిధిలో దాదాపు 13 కోట్లతో ఇప్పటి దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పొంగులేటి (Ponguleti)  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

గట్టుసింగారం గ్రామంలో ఇంటి పట్టాలు లేకుండా నిరుపేదలు ఎవరైనా ఉంటే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి పట్టాలు అందించాలన్నారు. రాబోయే వేసవి కాలంలో తాగు నీటి ఇబ్బందులు రాకుండా బోరు మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇవ్వడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>