కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తన పదవికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటైన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. పెరంబూర్ నియోజకవర్గ ప్రతినిధిగా కొనసాగాలని ఆయన నిశ్చయించుకున్నారు. రెండు చోట్లా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించినప్పటికీ సాంకేతిక కారణాలతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పెరంబూర్ ప్రజలకు అందుబాటులో ఉంటూనే రాష్ట్రవ్యాప్త అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.

