కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్షా బాధిత విద్యార్థులకు మద్దతుగా జులై 24న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కేటీఆర్ (KTR) నిర్వహించనున్న ధర్నాపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సెటైర్లు వేశారు. తాము తెరిచిన ధర్నా చౌక్ లోనే కేటీఆర్ ధర్నా చేస్తున్నాడని.. శాంతియుతంగా నిరసనలు చేస్తే పర్మిషన్ ఇస్తామని ఎద్దేవా చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
గ్లోబరీనా సంస్థ తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని ఆరోపించారు. గ్లోబరీనా పేరు మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందని చెప్పారు. పరువు ఉన్నవాడు పరువు నష్టం దావా వేస్తాడని అన్నారు. కేటీఆర్ (KTR) ఒకవేళ ఫిర్యాదు చేస్తే జన్వాడ భూములు ఏ రాజుల నుండి వచ్చాయో బయటకి తెస్తానని సీఎం (CM Revanth) స్పష్టం చేశారు. గ్లోబరీనా సంస్థ తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని.. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నెలకు రాయాలన్నారు.
కాగా, ఢిల్లీలో నీట్ పరీక్షా బాధిత విద్యార్థులకు మద్దతుగా జూలై 24 ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో బీఆర్ఎస్వీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా చేపట్టే ఈ నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు, విద్యార్థులు పాల్గొననున్నట్లు పార్టీ ప్రకటించింది.
Read Also: కరెంట్ కోతలు..సాగు కష్టాలు!
Follow Us On : WhatsApp

